వెంటిలేటర్‌లో మంటలు.. కరోనా పేషెంట్ల మృతి

మంగళవారం, 12 మే 2020 (15:16 IST)
ఓవర్ లోడ్ కారణంగా వెంటిలేటర్‌లో మంటలు ఏర్పడిన కారణంగా ఆస్పత్రిలో కరోనా రోగులు మరణించారు. రష్యాలో ఈ ఘోరం జరిగింది. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వచ్చాయని తెలిసింది. సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రమాదం జరిగిందని ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక వార్తల ద్వారా తెలిసింది. 
 
150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించారు. గత శనివారం మాస్కోలోని ఓ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభించినప్పుడు అక్కడ కరోనాకు చికత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మరణించారు. రష్యాలో కరోనా కేసులు సోమవారం నాటికి 2 లక్షల 21 వేలకు పెరిగాయి.
 
ఇక రష్యాలో కరోనా కొత్త కేసులు బాగా పెరుగుతున్నాయి. రష్యాలో సోమవారం 94 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2009గా ఉంది. రష్యాలో మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో 1,86,615 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు