చైనా మీదుగా పసుపు దుమ్ము.. బయటికి రావద్దొన్న ఉత్తర కొరియా

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:04 IST)
చైనా మీదుగా వీచే దుమ్ము, ధూళిలో విషపూరిత పదార్థాలు, వైరస్‌, సూక్ష్మక్రీములు ఉండే అవకాశాలు ఉన్నట్లు ఉత్తర కొరియా తమ ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా డ్రాగన్ దేశం చైనా నుంచి లేచిపడే పసుపు రంగు దుస్తు దుమ్ములో కరోనా వైరస్ వుండే అవకాశం వుందని.. అందుకే ప్రజలు ఎవరూ బయటకు రావద్దు అని ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. ఆ దేశ టీవీల్లో ఎల్లో డస్ట్ గురించి హెచ్చరికలు చేశారు. 
 
ఈ వార్నింగ్ వచ్చిన వెంటనే గురువారం రాజధాని ప్యోంగ్‌యాంగ్ వీధులన్నీ ఖాళీ అయినట్లు తెలుస్తోంది. తమ దేశంలో కరోనా వైరస్ కేసులు లేవని జనవరి నుంచి కిమ్ జాంగ్ ఉన్ సర్కారు చెప్తోంది. ఇంకా ఆ దేశ సరిహద్దుల్ని కూడా మూసివేయడం కూడా జరిగిపోతోంది. ఇంకా అనేక ఆంక్షలను అమలు చేస్తున్నారు. సీజనల్‌గా వీచే దుమ్ము మేఘాల వల్ల కోవిడ్-‌19 వ్యాప్తి చెందుతుందన్న ఆధారాలు లేవు.
 
కానీ నార్త్ కొరియా మాత్రం ఆ డస్ట్ క్లౌడ్స్ నుంచి దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. చైనా పొరుగుదేశమైన టుర్కెమిస్తాన్ కూడా తమ దేశ ప్రజలకు దుమ్ము విషయంలో వార్నింగ్ ఇచ్చింది. దుమ్ములో వైరస్ వ్యాప్తి అయ్యే ఛాన్సు ఉందని, అందుకే మాస్క్‌లు ధరించాలని ప్రజలను ఆదేశించింది.
 
చైనా, మంగోలియా ఎడారుల్లో ఉండే దుమ్ము, ధూళి.. ఎల్లో డస్ట్ రూపంలో ఉత్తర, దక్షిణ కొరియాల వైపు కొన్ని సమయాల్లో పయనిస్తుంటుంది. ఆ దుమ్ము విషపూరితం కావడం వల్ల రెండు కొరియా దేశాల్లో చాన్నాళ్ల నుంచి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి జరుగుతుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో కూడా ఈ వార్నింగ్‌ కీలకంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు