కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు- హెలికాఫ్టర్ల సాయంతో మంటల్ని..?

మంగళవారం, 7 జులై 2020 (15:23 IST)
Fire
అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగువా డుల్సే సమీపంలోని కార్చిచ్చుతో వెంటనే అప్రమత్తమైన ఆ దేశ అధికారులు లాస్ ఏంజెల్స్- మోజవే ఎడారిని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పాటు ఆ అడవి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
 
మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే అడవి సంబంధించిన 5,400 ఎకరాల్లో కార్చిచ్చుతో కాలిపోయింది. రహదారిని మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు.
 
2020 సంవత్సరం మొదట్లో ఆస్ట్రేలియాలోని అడవులు కార్చిచ్చుతో కొన్నివేల ఎకరాలు నాశనమయ్యాయి. ఇక ఆ తర్వాత 2019 డిసెంబర్‌లో మొదలైన కరోనా వైరస్ 2020 మొదటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటుంది. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో పెద్దగా ప్రాణనష్టం కలుగలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు