శృంగారం చేస్తూ గేమ్ అంది... ప్రియుడి కళ్లకు గంతలు కట్టి అది కట్ చేసేసింది...

మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:42 IST)
ఓ ప్రియుడికి ఓ ప్రియురాలు నరకం చూపించింది. శృంగారం చేస్తూ చేస్తూ మధ్యలో అతడితో ఓ ఆట ఆడుదామని చెప్పింది. ప్రియురాలు చెబితే కాదంటాడా.. ఓకే అనేశాడు. అంతే, వెంటనే పెద్ద వస్త్రాన్ని తెచ్చి అతడి కళ్లకు గంతలు కట్టింది. కాసేపు అతడిని రకరకాలు ఆట పట్టించింది. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా అతడి పురుషాంగాన్ని కత్తెరతో కట్ చేసేసింది. 
 
ఈ హఠత్పరిణామంతో అతడు విలవిలలాడిపోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా కేకలు వేశాడు. ఆమె ఎందుకలా దాన్ని కత్తిరించిందో తెలియక బెంబేలెత్తిపోయాడు. ఈ దారుణం అర్జెంటీనాలోని కార్డోబాలో జరిగింది. అసలు విషయంలోకి వెళితే... సెర్గియో ఫెర్నాండేజ్ అనే వ్యక్తి బ్రెండా బరట్టి అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
 
బ్రెండా వద్దకు రోజు మాదిరిగానే వచ్చాడతడు. కొద్దిసేపు శృంగారం ఆటలు ఆడుదామని చెప్పి మొక్కలను కత్తిరించే పెద్దపాటి కత్తెరతో అతడి వ్యక్తిగత భాగాన్ని కోసేసిందామె. అతడిది 90 శాతం కట్ అవడంతో షాక్ తిని సొమ్మసిల్లిపోయాడు. బాధతో అతడు పెట్టిన కేకలకు పొరుగువారు వచ్చి చూడగా అతడు రక్తపు మడుగులో పడి వున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. కాగా ఈ దారుణానికి కారణం... ఈమధ్య ఆమెతో జరిపిన శృంగారం తాలూకు ఘటనలను వీడియో తీసి అతడు తన స్నేహితుడికి పంపాడట. దీనితో ఆమె ఈ పని చేసినట్లు విచారణలో వెల్లడైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు