పాకిస్తాన్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయా? కారణం ఏంటి?

గురువారం, 3 సెప్టెంబరు 2020 (12:50 IST)
భారత్, అమెరికా, యూకే వంటి దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో దాయాది దేశమైన పాకిస్థాన్‌లో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి.  
 
పాకిస్థాన్‌లో కేసులు తగ్గేందుకు కారణం యువతే కారణమని తెలిసింది. వీరికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కరోనా వచ్చినా హాస్పిటల్‌కు వెళ్లకుండానే తగ్గించుకుంటున్నారు. దీంతో కరోనా తగ్గుముఖం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ వృద్ధులు తక్కువ సంఖ్యలో ఉంటారు.
 
అయితే భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల లిస్ట్‌ను బయటకు రాకుండా కప్పెడుతున్నారు. వీరిలా పాకిస్తాన్ కూడా చేస్తుందేమో అని కొంతమంది వాపోతున్నారు. ఎక్కువ జనాభా కారణంగా ఇరుకు ఇండ్లలో జీవించే వారికి కరోనా రాకపోవమేంటి అంటున్నారు. 
 
లాహోర్‌లోని సర్వీసెస్ హాస్పిటల్ డాక్టర్ సల్మాన్ హసీబ్ దీని గురించి మాట్లాడుతూ.. ''ఈ కేసులు ఎలా తగ్గుతున్నాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నాం. ప్రత్యేకంగా ఈ చర్యలు చేపడుతున్నామని ఖచ్చితంగా చెప్పలేం'' అని తెలిపారు. అయితే, పాక్‌లోని పరిస్థితుల వల్లే.. కరోనా కేసులు వ్యాప్తి జరగడం లేదని అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు