ఫ్లూటో గ్రహాన్ని అధికారికంగా ప్రకటించిన ఆరిజోనా రాష్ట్రం

ఠాగూర్

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (10:14 IST)
ఫ్లూటో గ్రహాన్ని అమెరికాలోని ఆరిజోనా స్టేట్ అధికారిక గ్రహంగా ప్రకటించింది. కొన్నాళ్ల కిందట వరకు నవ గ్రహాల్లో అది చిట్టచివరిదిగా గుర్తింపు ఉన్న ఫ్లూటో... 2006లో గ్రహం హోదా కోల్పోయింది. అది మరుగుజ్జు గ్రహమని, సౌర కుటుంబంలోని ఓ వస్తు రూప పదార్థం మాత్రమేనని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయినప్పటికీ, అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఫ్లూటోను తమ రాష్ట్ర అధికారిక గ్రహాంగా ప్రకటించింది. 
 
ఈ మేరకు బిల్లుపై ఆరిజోనా రాష్ట్ర గవర్నర్ కేటీ హాబ్స్ ఆమోదముద్ర వేశారు. అయితే, ఫ్లూటోను ఒక పూర్తిస్థాయి గ్రహంగా మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు కేటీ హాబ్స్ సమాధానం దాటవేశారు. అందుకు బదులుగా అమెరికా అంతరిక్ష పరిశోధనల్లో ఆరిజోనా పరిశోధకుల భాగస్వామ్యాన్ని, వారి ఘనతలను కొనియాడారు. అమెరికా ఖగోళ శాస్త్రవేత్త క్లైడ్ టోంబా 1930లో ఆరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటరీ నుంచి ఫ్లూటోను గుర్తించారు. మిగిలిన గ్రహాలను అమెరికా వెలువలే ఆవిష్కరించగా, అమెరికాలో ఒక్క ఫ్లూటోను మాత్రమే గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు