యువకుడి వినూత్న చోరీ.. బొమ్మలా నిలబడి నగలు దొంగతనం

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:07 IST)
పోలాండ్ దేశంలో ఓ యువకుడు నగల దుకాణంలో చోరీకి ప్లాన్ చేశాడు. అయితే, ఆ షాపులో నిత్యం రద్దీగా ఉండటంతో అతనకు ఆ వినూత్న ఆలోచన వచ్చింది. రాత్రి షాపు మూయడానికి కొంత సమయం ముందు షాపులోకి వెళ్లిన యువకుడు.. బొమ్మలా (మెనాక్విన్) నిల్చుండిపోయాడు. సమయం ముగియడంతో షాపును మూసివేశారు. ఆ తర్వాత షాపులో తనకు కావాల్సిన నగలను దొంగిలించాడు. ఈ ఘటన పోలాండ్ దేశంలోని వార్సా నగరంలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలాండ్ దేశ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నిందితుడు తొలుత ఓ షాపింగ్ సెంటరులోని జ్యూవెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలియకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.
 
షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తర్వాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా తనకు కావాల్సిన వంటకాలను ఆరగించి, ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. అయితే చివర్లో అతడికి దురదృష్టం వెంటాడడంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడికి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు