వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో నగ్నంగా భార్య.. మెరుపు తీగలా..?

ఆదివారం, 26 జులై 2020 (11:46 IST)
కరోనా వైరస్ కారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అష్టకష్టాలు తప్పట్లేదు. సీరియస్ కార్యక్రమాలు డిస్టర్బ్ అవుతూ... లైవ్ ప్రోగ్రామ్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయి. బ్రెజిల్‌లో తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఓ మహిళ నగ్నంగా కనిపించి.. అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు బాగా ఉన్న బ్రెజిల్‌లో అలాంటిదో మరో ఘటన జరిగింది. 
 
ఇంతకీ ఏం జరిగిందేమిటంటే? ఓ టీవీ యాంకర్.. తన ఇంటి నుంచి మాజీ అధ్యక్ష అభ్యర్తి, రాజకీయ నేత గులిహెర్మే బౌలోస్‌తో లైవ్ చాట్ మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరూ వీడియో కాన్ఫరెన్స్‌లో చాట్ చేసుకుంటుంటే యాంకర్ భార్య నగ్నంగా వెనక నుంచి వెళ్లిన దృశ్యం కెమెరా కంట పడింది. ఆమె కెమెరాకు చిక్కకుండా ఉండేందుకు అక్కడికీ... కిందకు వంగి మరీ వెళ్లింది. అయినప్పటికీ కెమెరాలో చిక్కింది.
 
ఈ విషయం కనిపెట్టిన బౌలోస్ దానిపై స్పందించడంతో యాంకర్ ఫాబియో పోర్చాట్ షాకయ్యాడు. నిన్ను అందరూ చూశారు. అలా ఎందుకు వెళ్లావు అని భార్యను అడిగాడు. అందరూ ఎక్కడ చూశారు. నువ్వు చూశావా అని ఆమె అడిగింది. దాంతో యాంకర్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన వెనక నుంచి తన భార్య వెళ్లిందనీ... అనుకోకుండా ఇలా జరిగిందని యాంకర్ చెప్పాడు. 
 
ఇన్‌స్టాగ్రామ్ పాలిటిక్స్ లైవ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్... జులై 3 నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె నగ్నంగా వెళ్లినా... మెరుపు తీగలా వెళ్లిపోయిందనీ... అందువల్ల యాంకర్ బాధపడాల్సిన పని లేదని కొందరు నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు