ప్రేక్షకులే కాదు.. చీర్ గాళ్స్ కూడా లేరు.. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు!!

గురువారం, 17 సెప్టెంబరు 2020 (15:50 IST)
ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. యూఏఈ వేదికగా జరుగున్న ఈ పోటీలు కరోనా మహమ్మారి నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగన్నాయి. మఖ్యంగా, స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే తొలిసారి ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అంటే ఖాళీ స్టేడియాలో పూర్తి సురక్షిత వాతావరణంలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 
 
అంతేకాకుండా, చీర్ గాళ్స్, ప్రేక్షకులు లేకుండా క్లోజ్‌డ్ డోర్స్ మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా టీవీ ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రేక్షకులు స్టేడియానికి వచ్చి వీక్షించే అవకాశం లేకపోవడంతో వారంతా టీవీల్లో వీక్షిస్తారని, ఫలితంగా ఈసారి రేటింగ్ అధికంగా ఉంటుందని బ్రాడ్‌కాస్టర్లు భావిస్తున్నారు. 
 
ప్రస్తుతానికి స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా, మున్ముందు మాత్రం 30 శాతం మంది స్టేడియంలో సామాజిక దూరం పాటిస్తూ కనిపిస్తారని బీసీసీఐ చీఫ్ గంగూలీ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఒక్కొక్కరినీ చెక్ చేసి స్టేడియంలోకి పంపించే రోజు త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు