తొలిసారి స్టాక్ మార్కెట్ లోకి రాబోయే ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్టింగ్ యాప్ Lemonn

ఐవీఆర్

మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (22:35 IST)
Lemonn (లెమన్) అనేది పీపల్ కో యొక్క సరికొత్త ఉత్పత్తి. ఆశిష్ సింఘాల్, విమల్ సాగర్ తివారీ, గోవింద్ సోనీ స్థాపించిన హౌస్ ఆఫ్ ఫిన్‌టెక్ ఉత్పత్తుల సంస్థే ఈ పీపల్ కో సంపదను సృష్టించడమే కాదు ఆ సంపద ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడాలనే కృతనిశ్చయంతో పీపల్ కో సంస్థను ఏర్పాటు చేశారు ఆశిష్ సింఘాల్, గోవింద్ సోనీ, విమల్ సాగర్ తివారీ. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సరికొత్తగా స్టాక్ ఇన్వెస్టింగ్ యాప్ Lemonn (లెమన్)ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. ఇది కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చే వారి కోసం ఉద్దేశించబడింది. దీనిద్వారా మార్కెట్ లోకి రావాలి అనుకునే వారు సరికొత్తగా నేర్చుకునేందుకు, తెలివిగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను సంబంధించి కొత్త యాప్‌ని ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా పీపల్‌ కో-గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.., “అందరికీ డబ్బును సమానంగా సంపాదించేలా చేయడం, అందుకోసం సరైన ఉత్పత్తులతో భారతదేశాన్ని మరింతగా శక్తివంతం చేయడమే మా లక్ష్యం. Lemonn(లెమన్) వినియోగదారులు వారి పోర్ట్‌ఫోలియోను విభిన్నంగా నిర్వహించుకోవడానికి, భారతదేశ వృద్ధి కథలో పాల్గొనడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
 
“మిలియన్ల మంది భారతీయులు స్టాక్ మార్కెట్లను నేటికీ చాలా తక్కువగా ఫాలో అవుతున్నారు. మహమ్మారి తర్వాత వృద్ధి ఉన్నప్పటికీ, కేవలం 6% భారతీయులు మాత్రమే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారు. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆకర్షణీయంగా, సమాచారంగా, అప్రయత్నంగా చేయడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు ఆయన.
 
Lemonn (లెమన్) యొక్క ప్రత్యేక లక్షణాలు:
జీరో కాస్ట్‌తో ట్రేడ్: 3 నెలలకు జీరో-ట్రేడింగ్ బ్రోకరేజ్, ఖాతా తెరవడానికి జీరో రుసుము.
ఐడియాలలో పెట్టుబడి: క్యూరేటెడ్ పరిశ్రమ-ఆధారిత స్టాక్ ఆఫర్.
వివరించబడిన జార్గాన్స్: అన్ని ఆర్థిక, మార్కెట్ సంబంధిత నిబంధనలను వివరించే వివరణాత్మక పదకోశం
 
“దేవం Lemonn(లెమన్)ను ప్రారంభించడం కోసం మొదటి రోజు నుండి కష్టపడ్డాడు. చర్చల దశ నుంచి వాస్తవ రూపం దాల్చే వరకు అతను చాలా చురుకుగా పనిచేశాడు. అతని వల్లే ఇది సాధ్యమైంది. Lemonn(లెమన్)ను మిలియన్ల మంది పెట్టుబడిదారులు ఇష్టపడే ఉత్పత్తిగా మార్చగల అతని సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది,” అని సింఘాల్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు