వాట్సాప్ కస్టమర్లకు భారీ షాక్.. త్వరలో సర్వీసులపై ఛార్జీలు

శనివారం, 24 అక్టోబరు 2020 (11:49 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా లేనిదే ఇప్పుడు ఎవ్వరికీ ముద్దదిగడం లేదు. అదీ వాట్సాప్ లేకపోతే పొద్దు గడవదు. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో వినూత్న ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజురోజుకు వాట్సప్ తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ దూసుకుపోతుంది. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ అగ్రస్థానంలో కొనసాగుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఫేస్‌బుక్ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కస్టమర్ల అందరికీ త్వరలో భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో వాట్సాప్ సర్వీసులపై ఛార్జీలు విధించేందుకు ఫేస్‌బుక్ సిద్ధమవుతోంది. అయితే ఈ ఛార్జీలు మాత్రం ప్రతి ఒక్కరికీ వర్తించవు అని చెప్పాలి. 
 
ఇప్పటివరకు ఎవరైతే వాట్సాప్ కస్టమర్లు బిజినెస్ వాట్సాప్ సర్వీసులను పొందుతున్నారో వారికి మాత్రమే సరికొత్తగా చార్జీలు విధించేందుకు నిర్ణయించింది ఫేస్‌బుక్. త్వరలోనే బిజినెస్ అకౌంట్ వాడుతున్న కస్టమర్ల నుంచి పలు సర్వీసులకు గానూ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది.
 
వాట్సప్ ఒక బ్లాగ్‌లో పోస్ట్‌లో ఈ విషయాన్ని క్లుప్తంగా వెల్లడించింది. కాగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లు ఇప్పటికే ఐదు కోట్ల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ కస్టమర్లకు కాకుండా కేవలం బిజినెస్ వాట్సాప్ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే చార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించామంటూ ఇటీవల ఫేస్ బుక్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు