వాట్సాప్ నుంచి ఇక లోన్లు కూడా... అచ్చం పేటీఎం, ఫోన్ పే లాగానే...!

గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:53 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ సంస్థ ప్రస్తుతం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న వాట్సాప్ త్వరలోనే భారత్‌లోని ప్రజలందరికీ లోన్లు ఇవ్వడానికి సిద్దమవుతోంది. వాట్సాప్‌ను సొంతం చేసుకున్న  ఫేస్‌బుక్‌ తన ఫైనాన్సియల్ సర్వీసులను మరింత విస్తరించాలనుకోవడంతోనే తన సేవలను మరింత విస్తరిస్తోంది. 
 
ఇందులో భాగంగానే క్రెడిట్ సర్వీస్‌ను ఇండియాలో లాంచ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా నుంచి అనుమతులను వాట్సాప్ పొందింది. 
 
ప్రస్తుతం ఈ ఫీచర్ పేమెంట్స్ ఆప్షన్‌లో చూడవచ్చు. కాగా, ఈ ఫీచర్ అచ్చం పేటీఎం, మోబిక్విక్, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు