నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు 
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
 
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు