ఆ సిరప్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త...

గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:09 IST)
ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ అటాట్ ఇండియా తన గోవా కంపెనీలో తయారు చేసే యాంటాసిడ్ సిరప్ డైజీన్ జెల్‌కు సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. ఈ కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. పింక్ రంగులో ఉండే ఈ మెడిసిన్‌ను వినియోగదారులు ఆగస్టు నెల ప్రారంభంలో కొనుగోలు చేసినపుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా ఘాటైన వాసన కలిగివున్నట్టు రిపోర్టులు వచ్చాయి.
 
దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అబాట్ యాంటిసిడ్ డైజీన్ జైల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటిసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరుకుంటుంది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని దీనివల్ల రోగి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు