కష్టాలకే కష్టాలు... 100 కిమీ నడిచిన నిండు గర్భిణి .. ఎక్కడ?

సోమవారం, 30 మార్చి 2020 (18:40 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో అన్ని రంగాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా, పేదలు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న, చిరు వ్యాపారులు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరందరిలోకెల్లా.. వలస కార్మికుల బాధరు వర్ణనాతీతంగా ఉన్నాయి. లాక్‌డౌన్ పుణ్యమాని దేశ వ్యాప్తంగా వాహన రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో మరో 15 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. దీంతో ఉపాధి లేక తమ జీవనం మరింత దుర్భరంగా మారుతుందని భావించిన అనేక మంది తమతమ స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. ఇలాంటి వారిలో ఎనిమిది నెలలు నిండిన గర్భిణి కూడా ఉంది. ఈమె తన భర్తతో కలిసి ఏకంగా 100 కిలోమీటర్లు నడిచింది. అదీకూడా వేళకు తిండిలేకుండ. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షార్‌ జిల్లాలోని అమర్‌గర్హ్‌ గ్రామానికి చెందిన వాకిల్‌, యాస్మీన్‌.. షాహారన్‌పూర్‌లోని ఓ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ పరిశ్రమను మూసేశారు. వాకిల్‌, యాస్మీన్‌ను తమ సొంతూరికి వెళ్లిపోవాలని పరిశ్రమ యజమాని ఆదేశించాడు. దారి ఖర్చుల కోసం కనీసం వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ దంపతులు తమ ఊరికి పయనమయ్యారు. 
 
షాహారన్‌పూర్‌ నుంచి మీరట్‌లోని సోహ్రబ్‌ గేట్‌ వద్దకు సుమారు 100 కిలోమీటర్లు కాలినడకన చేరుకున్నారు. గర్భిణిని గమనించిన ఇద్దరు యువకులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ గర్భిణికి యువకులు అన్నం పెట్టి మంచి నీళ్లు ఇచ్చారు. పోలీసులు గర్భిణి వద్దకు చేరుకుని.. ఆమెను అంబులెన్స్‌లో అమర్‌గర్హ్‌కు తరలించారు. అన్ని కిలోమీటర్లు నడవడంతో ఆమె బాగా అలసిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు