పంజాబ్, ఢిల్లీలో విజృంభిస్తోన్న కరోనా.. 3800 పోలీసులకు కోవిడ్

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:20 IST)
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా పంజాబ్‌లో 3800 మందికి పైగా పోలీసులకు కొవిడ్‌ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3803 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,186 మంది కోలుకోగా, ఇంకా 1,597 మంది పోలీసులు చికిత్స పొందుతున్నారు.
 
కోవిడ్‌తో బాధపడుతున్న పోలీసులకు రూ.1700 విలువ గల (పల్స్‌ ఆక్సీమీటర్‌, శానిటైజర్లు, డిజిటల్‌ థర్మామీటర్‌, విటమిన్‌ మాత్రలు) కిట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న 20 మందికిపైగా పోలీసులు ప్లాస్మా దానం చేశారు.
 
అలాగే ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 2077 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,526కి చేరింది. ఇందులో 1,68,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు