రామ మందిర నిర్మాణ వ్యయం ఎంతో తెలుసా? (video)

బుధవారం, 5 ఆగస్టు 2020 (12:13 IST)
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమిపూజా కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ భూమిపూజలో పాల్గొని, పునాది రాయి వేశారు. ఈ ఆలయ నిర్మాణం మూడున్నరేళ్ళలో పూర్తికానుంది. అయితే, ఈ రామ మందిర నిర్మాణం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా, మందిర నిర్మాణం కంటే.. 20 ఎకరాల విస్తీర్ణంలో కల్పించనున్న వివిధ రకాల మౌలిక సదుపాయాలతో పాటు... గార్డెన్ నిర్మాణం కోసమే అధిక మొత్తాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రధానంగా మూడున్నరేళ్ళలో పూర్తయ్యే ఆలయ నిర్మాణం కోసం రూ.300 కోట్లు వెచ్చించనుండగా, 20 ఎకరాల్లో మౌలిక వసతులు, గార్డెనింగ్ కోసం ఏకంగా రూ.1000 కోట్లను ఖర్చు చేయనున్నారు. అదేసమయంలో ఈ ఆలయాన్ని శిల్పాశాస్త్రం ప్రకారం నగర శైలిలో నిర్మించనున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం వాడే ఇటుకల్లో 2 లక్షల ఇటుకలపై శ్రీరామ్ అనే అక్షరాలు కూడా రాయనున్నారు. వీటిని ఆలయ పునాదుల్లో వినియోగించనున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు