యువతిపై గ్యాంగ్ రేప్: చంపేస్తారేమోనని చెప్పలేదు కానీ ఆమె చనిపోయింది

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:10 IST)
అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారిపోతోంది. కామాంధులు యువతులను బలి తీసుకుంటున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా వారు ఏమాత్రం భయపడటంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారని పాల్పడ్డారు. బాధితురాలు చికిత్స పొందుతూ గురువారం మరణించింది. ఈ విషయం ఆమె చనిపోయాక వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీపూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసారు. ఇంటికి వచ్చి తమ కుమార్తె పరిస్థితి చూసిన ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకి గత రెండు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐతే గురువారం ఆమె పరిస్థితి విషమించి కన్నుమూసింది.
 
కాగా అత్యాచారం జరిగినట్లు పోలీసులకి ఫిర్యాదు అందలేదు. దీనిపై బాధితురాలి తండ్రి స్పందిస్తూ... కేసు పెడితే తమను చంపేస్తారన్న భయంతో పోలీసులకి ఫిర్యాదు చేయలేదన్నాడు. తన కుమార్తెపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని చెప్పాడు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు