'బ్యాచిలర్ లైఫ్' ముగింపు పార్టీ పేరుతో స్నేహితురాలిపై బలాత్కారం...!

మంగళవారం, 17 నవంబరు 2020 (09:02 IST)
బ్యాచిలర్ జీవితం ముగింపు పార్టీతో తన స్నేహితురాలిని హోటల్‌కు పిలిచి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి తాజాా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ముబై మహానగరంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అవినాశ్ పంగేకర్ (28), శిశిర్ (27), తేజస్ (25) స్నేహితులు అనే ముగ్గురు స్నేహితులు. వీరిలో అవినాశ్‌కు పెళ్లి కుదిరించింది. ఈ సందర్భంగా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి తన ఇద్దరు స్నేహితులతోపాటు మరో ముగ్గురు యువతులను అవినాశ్ గతవారం ముంబై అంధేరిలోని ఓ హోటల్‌కు ఆహ్వానించాడు.
 
ఈ బ్యాచిలర్ పార్టీ తర్వాత ఇద్దరు యువతులు వెళ్లిపోగా, ఒక్క అమ్మాయిని మాత్రం ఉండమని చెప్పి మాటల్లో దించి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆమెపై అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడి హోటల్ నుంచి పరారయ్యారు. 
 
ఈ ఘటన జరిగినప్పటి నుంచి మౌనంగా ఉంటూ తనలో తానే కుమిలిపోతున్న బాధితురాలు, ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం చెప్పి భారం దించుకునే ప్రయత్నం చేసింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు