ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత... బిల్లుకు ఆమోదం

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:21 IST)
కరోనా వైరస్ మహమ్మారి కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, పొదుపు మంత్రాన్ని జపించాలని నిర్ణయించింది. ఇప్పటికే కరోనా సాకుపెట్టి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
 
అలాగే, అనేక రకాలైన పొదుపు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఎంపీ వేతనాల్లో కోతకు లోక్‌సభ ఆమోదం తెలింది. మహమ్మారిపై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 
 
ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. అలాగే, ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు