రాజస్థాన్ సరిహద్దులు బంద్

బుధవారం, 10 జూన్ 2020 (21:50 IST)
వారం రోజుల పాటు రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాజస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్‌లు ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది.

రాజస్తాన్‌కు యుపి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రం నుండి వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కచ్చితంగా పాస్‌లు ఉండాల్సిందేనని డిజిపి తెలిపారు. సంబంధిత పాస్‌లను కలెక్టర్లు, ఎస్‌పిల నుండి తీసుకోవాలని అన్నారు.

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌లు (ఎన్‌ఒసి) ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని నిర్నయించినట్లు ఆయన వివరించారు.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లలో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాజస్తాన్‌లో బుధవారం తాజాగా 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,300కి చేరగా, 256 మంది మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు