అసలే అత్యాచార నిందితుడు.. తల్లీకూతుళ్లను ట్రాక్టర్‌తో ఢీ కొట్టించి చంపేశాడు..

గురువారం, 16 జులై 2020 (17:19 IST)
తనను జైలుకు పంపారనే అక్కసుతో అత్యాచార నిందితుడు తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాకు చెందిన యశ్‌వీర్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరి మధ్య 2016, జులై వరకు స్నేహం బాగానే సాగింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని.. అదే ఏడాది 13 ఏళ్ల వయసున్న బాలికపై అత్యాచారం చేశాడు. 
 
పోలీసులు యశ్ వీర్‌ను అత్యాచారం కేసు కింద.. 2016, అక్టోబరులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత యశ్ వీర్ జైలు పాలయ్యాడు. బెయిల్‌పై 2017 చివరలో విడుదల అయ్యాడు. అప్పట్నుంచి తనను జైలు పాలు చేసిన అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. అదను చూసి దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం (జూలై 14)వ తేదీ.. సైకిల్‌పై వెళ్తున్న తల్లీకూతుళ్లను ట్రాక్టర్‌తో ఢీకొట్టేలా చేశాడు యశ్‌వీర్.
 
ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యశ్ వీర్ అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు