14 ఏళ్లుగా ఆమెకు టీయే ఆహారం

బుధవారం, 15 జనవరి 2020 (09:56 IST)
14 ఏళ్లుగా ఆమెకు టీయే ఆహారం. ఆరోగ్యం సహకరించకున్నా రకరకాల వంటకాలు తినాలని నాలుక ఉవ్విళ్లూరుతుంటుంది. కానీ ఓ మహిళ కేవలం టీతో ఆకలిని చల్లార్చుకుంటోంది.

14 ఏళ్ల కిందట కుమారుడు మరణించగా, ఆనాటి నుంచి టీ తప్ప మరేమీ తీసుకోవడం లేదు. కర్ణాటకలో విజయపుర జిల్లా తాళికోటె తాలూకా సాసనూరుకు చెందిన శాంతమ్మ బిరాదార్‌ (75)కు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు. కొడుకు, భర్త చనిపోయిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకుంది.

టీ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. చిన్న మఠంలో ఉంటున్న ఆమె అన్నం ముట్టదు. కుటుంబీకులు వైద్యుల వద్ద చూపించగా, ఆమె ఆరోగ్యం బాగుందని తేల్చారు. భోజనం చేయాలని వైద్యులు సూచించినా ఆమె మాత్రం రోజుకు 4 సార్లు టీ తాగుతూ ఆకలిని జయిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు