పదో తరగతికే పక్కదారి పట్టి పాడయిపోయాడు, స్నేహితుడు అందుకు ఒప్పుకోలేదనీ...

మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:36 IST)
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మరక్కోణం సమీపంలోని నోచ్చికుప్పం గ్రామంలో నివాసముండే గోవిందరాజ్ కుమారుడు వేదన్ రాజ్ 10వ తరగతి పూర్తి చేశాడు. అతనికి క్లోజ్ ఫ్రెండ్ అభినేష్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. దీంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
 
కరోనా కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్న వీరు ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడేవారు. ఎప్పటిలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్ళిన వేదన్ రాజ్ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయ్యింది రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేదన్ రాజ్ చివరిసారి ఎవరితో ఫోన్లో మాట్లాడాడో పోలీసులు ట్రేస్ చేశారు.
 
అందులో అభినేష్ నెంబర్ ఉంది. దీంతో అతడిని విచారించారు. వేదన్‌తో గొడవ జరిగిందని.. చంపేశానన్నాడు. మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం చేస్తే అందులో లైంగికంగా వేధించబడ్డాడని రిపోర్ట్ వచ్చింది. దీంతో అభినేష్‌ను గట్టిగా నిలదీస్తే తనకు స్వలింగ సంపర్కం అంటే ఇష్టమని.. అందుకే వేదన్ రాజ్‌ను పిలిచానని, అతను ఒప్పుకోకపోవడంతో చంపేశానని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు