భారత్‌లో అడుగెట్టిన ట్రంప్.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తాజ్‌మహల్ (వీడియో)

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (12:03 IST)
TrumpInIndia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టారు. అహ్మాదాబాద్ విమానాశ్రయానికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న ట్రంప్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదిక వరకు వారు చేరుకోనున్నారు. భారత్‌కు ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌‌ను సందర్శిస్తారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత వేడుకలను నిర్వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ రాకను పురస్కరించుకుని ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విరబూసిన పుష్పాలు ట్రంప్ దంపతులకు కనువిందు చేయనున్నాయి. అగ్రదేశాధినేత రాక నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్రంప్ దంపతుల రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇవాళ సోమవారం పర్యాటకుల సందర్శనకు సెలవు ప్రకటించారు. 

LIVE: PM Shri @narendramodi welcomes US President @realDonaldTrump in Ahmedabad, Gujarat. #NamasteTrump https://t.co/aApBlBfOlg

— BJP (@BJP4India) February 24, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు