ప్రేమ పేరుతో బాలికపై బలవంతంగా అత్యాచారం..

శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:33 IST)
ప్రేమ పేరుతో ఓ బాలుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తరాఖంఢ్‌లో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా.. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని పంత్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన కిశోర్ అనే మైనర్ బాలుడు పొరుగున నివసించే మరో మైనర్ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. తరువాత ఆమెపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆగస్టు 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తరువాత విషయం గురించి తల్లిదండ్రులకు తెలుపడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మైనర్‌ను గురువారం అదుపులోకి తీసుకుని జువెనైల్ కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు