సహజీవనానికి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి : అలాంటి బంధాల రిజిస్టర్‌కు నో

ఠాగూర్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (15:30 IST)
ఉత్తరాఖండ్ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇకపై లివిన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని లేకపోతే జైలుశిక్ష తప్పదని పేర్కొంది. ఈ బిల్లులను జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. మరోవైపు, ఈ బిల్లు చట్టంగా మారితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సహజీవనం చేయడానికి కూడా తమ పేర్లను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితో లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకునేవారు యువతీయువకులతో పాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి వయసు 21 యేళ్ళు నిండి ఉండటంతో పాటు తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 
 
అయితే, ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్ చేయరు. అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమైనా, మరొకరితో రిలేషన్‌లో ఉన్నా, భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు. అలాగే, బలవంతంగా కానీ, గుర్తింపు వంటివాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు