ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా నెగెటివ్.. వారం రోజుల్లో విధులకు...

మంగళవారం, 13 అక్టోబరు 2020 (09:17 IST)
కరోనా వైరస్ బారినపడిన భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు తిరిగి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. వెంకయ్య నాయుడుకు ఎయిమ్స్ వైద్యబృందం సోమవారం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. వెంకయ్యకు కరోనా నయమైందని వెల్లడి కావడంతో అందరిలోనూ నిశ్చింత ఏర్పడింది. 
 
వెంకయ్య నాయుడుకు కరోనా అంటూ సెప్టెంబరు 29న ఓ ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి వెంకయ్యనాయుడు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందన్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. త్వరలోనే వెంకయ్య నాయుడు అధికారిక విధులకు హాజరవుతారని, డాక్టర్ల సూచనల మేరకు వ్యవహరిస్తారని ఓ ప్రకటన చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు