కార్తీక మాసంలో ఇవి తీసుకోకూడదు.. మంగళవారం పూట..?

మంగళవారం, 24 నవంబరు 2020 (05:00 IST)
కార్తీక మాసంలో ఆహారంతో పాటు ఇంగువ, ఉల్లిపాయ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు, కందులు వాడకూడదు. అష్టమి రోజున కొబ్బరి తినకూడదు. ఆదివారం ఉసిరి తీసుకోకూడదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. 
 
కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే కార్తీక మాస దీపారాధన ఉద్దేశ్యం. కార్తీక మంగళవారం పూట గౌరీ దేవి పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇంకా హనుమంతుడిని పూజించడం సకల సంపదలను ఇస్తుంది. భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. 
 
ఇక దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువమంది దీపరాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనెను పోస్తుంటారు. అయితే అలా చేయకూడదట. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె వేసి ఆ తర్వాత వత్తులను అందులో వేయాలి. అలాగే స్టీల్ కందుల్లో దీపారాధన చేయకూడదు. దీపారాధనను వెండి కుందులు, పంచలోహ కందులు, ఇత్తడి కందులు మరియు మట్టి కందులలో మాత్రమే చేయాలి.
 
అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీగణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. అలాగే పసుపు రంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల జఠర, ఉదరవ్యాధులు, కామెర్ల రోగం తగ్గుతాయి.
 
ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే.. స్త్రీలందరూ ఉదయం సూర్యోదయం సమయానికి దీపారాధన చేయడం శ్రేయస్కరం. అయితే అందరికీ ఆ సమయానికి అవకాశం ఉండటం లేదు. కానీ అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదు. కాబట్టి మీరు సంకల్పంతో సూర్యోదయం తర్వాత కూడా చేయొచ్చు. అయితే మరీ 10 గంటలు లేదా 11 గంటల తర్వాత మాత్రం చేయకూడదు. అలాగే సాయంత్రం 5:30 నుండి 6 గంటలు దాటిన తర్వాత దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు