ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజ చేస్తారో? (Video)

మంగళవారం, 28 జులై 2020 (19:34 IST)
lord shiva
తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవతకు నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి వుండటంతో పాటు.. ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మానసిక రుగ్మతలు వుండవు. భయాందోళనలు తొలగిపోతాయి. 
 
ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి.. అలంకరించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.
 
ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని ఇంటిదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి
 
అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చినా లేదంటే.. అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే  రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.   
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు