వామ్మో, ఏనుగు కలలో కనిపించింది, ఏం జరుగుతుంది?

గురువారం, 17 సెప్టెంబరు 2020 (19:49 IST)
ప్రతి మనిషికి ఏవేవో కలలు వస్తుంటాయి. ఒక్కో కలకు ఒక్కో అర్థం వుంటుందంటారు. కొన్ని కలలు శుభకరమైనవైతే మరికొన్ని కీడుకు సూచకంగా వస్తాయనేది విశ్వాసం. చాలామందికి మన చుట్టు వున్నవారే కలల్లో కనబడుతుంటారు. ఐతే మరికొందరికి పర్వతాలు, నదులు, అడవులు, జంతువులు కనిపిస్తుంటాయి. 
 
ఒక్కోసారి పులులు, సింహాలు, ఏనుగులు కూడా కనిపిస్తుంటాయి. ఒకవేళ అలాంటి జంతువులు కనుక మీ కలలో కనిపించినప్పుడు భయం కలుగుతుంది. హఠాత్తుగా మెళకువ వస్తుంది. అప్పటికే నాలుక పిడచకట్టుకుపోయి వుంటుంది. దాంతో మంచినీళ్లు తాగి భయంతోనే నిద్రిస్తారు. మరునాడు ఉదయం లేవగానే ఈ విషయాన్ని అందరితో చెబుతూ ఆందోళన చెందుతుంటారు.
 
కాని ఒక విషయం, కలలో ఏనుగు కనుక కనిపిస్తే మంచిదేనని శాస్త్రంలో చెప్పబడుతోంది. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడింది. మరి అటువంటి ఏనుగు కలలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రధమని ఆధ్యాత్మికం గ్రంధాలలో వివరించారు. ఏనుగులను దర్శించుకోవడం సమస్త పాపాలు, దారిద్య్రం, దుఃఖాం నశించిపోతాయి. 
 
అలానే ఏనుగును దర్శించుకోవడం వలన అదృష్టం, ఐశ్వర్యం చేకూరుతుందని అందరి నమ్మకం. పుణ్యక్షేత్రాలలో గజ వాహనంగా ఏనుగులు భగవంతుని సేవలలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అందరి విఘ్నాలను తొలగిస్తుంటాడు. అలాంటి ఏనుగులు కలలోనే కాదు బయట కనిపించినా కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయని శాస్త్రంలో స్పష్టం చేయబడింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు