#Mahashivratri మహా మృత్యుంజయ మంత్రం పూర్తి తాత్పర్యం...

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (12:03 IST)
ఈ సృష్టికి మూలం, ఈ విశ్వ మౌలిక లక్షణం కూడా ఈ విశాలమైన శూన్యమే! ఈ నక్షత్ర మండలాలు కేవలం దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యం. దాన్నే 'శివ' అంటారు. అంటే అదే గర్భం. ప్రతిదీ దీని నుంచే పుడుతుంది. తిరిగి దానిలోనే లయమై పోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి. అలాంటి శివుడు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరోజు ఆయన కదలికలన్నీ ఆగిపోయి, సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. శివుడిని మహా మృత్యుంజయ మంత్రంతో జరిపించడం ఎంతో మేలు జరుగుతుందట. 
 
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌" 
 
భావం: 'అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి'.
 
మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ పెద్దల మాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు