మనలను క్రిందకి దిగలాగేది అదే... స్వామి వివేకానంద

శనివారం, 15 డిశెంబరు 2018 (14:11 IST)
1. శరీరాన్ని గురించి మనమెంత తక్కువుగా ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే మనలను క్రిందకి దిగలాగేది ఈ శరీరమే. సంగత్వం, దేహాత్మభ్రాంతి- ఇవే మన దుఃఖాలకు కారణం. రహస్యం ఏమిటో తెలుసా, నేనీ దేహాన్ని కాను, ఆత్మను. ఈ సమస్త ప్రపంచం, దానిలోని సర్వబంధాలు-మంచీ చెడులు, సుఖధుఃఖాలు ఇవన్నీ ఒక తెరమీద చిత్రీకరించిన బొమ్మల వంటివి. వీటన్నింటిని చూస్తూ ఉండే ద్రష్టనే నేను అని  నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి.
 
2. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు.
 
3. భౌతికసంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.
 
4. భయపడవద్దు... జాగరూకతతో పనిలో నిమగ్నం కండి. గమ్యం చేరుకునేంతవరకూ ఆగవద్దు.
 
5. పరిపూర్ణ అంకిత భావం. పవిత్ర, అతిసునిశితమైన బుద్ది, సర్వాన్ని జయించగల సంకల్పం- వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మెుత్తం ప్రపంచంలో పెనుమార్పు సంభవిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు