కమనీయం రమణీయం.. శ్రీవారి ముఖారవిందం

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:08 IST)
రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వాహన సేవలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వాహన సేవలు ఎంతో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు రాత్రి వరకు జరగనున్నాయి.
 
మరోవైపు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారు రథసప్తమిని పురస్కరించుకుని సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిస్తున్నారు. తెల్లవారుజామున సూర్యప్రభవాహనంపై వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్సించుకున్నారు. గోవిందనామస్మరణల మధ్య వాహనసేవ వైభవోపేతంగా జరిగింది. 
 
రాత్రి వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. ప్రతియేటా రథసప్తమి నాడు టిటిడి అనుబంధ ఆలయాల్లో సప్తవాహన సేవలను నిర్వహిస్తూ వస్తోంది. తిరుచానూరుతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కళ్యాణవేంకటేశ్వరస్వామిలలో కూడా రథసప్తమిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు రథసప్తమి సందర్భంగా పలు సేవలను ఆలయాల్లో టిటిడి రద్దు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు