శ్రీవారి భక్తులు తోసుకోకండి.. మీకు కావాల్సిన టోకెన్లు ఇవిగో రండి

శనివారం, 7 నవంబరు 2020 (16:49 IST)
వారాంతం అయితే చాలు.. గందరగోళం.. స్వామివారిని దర్సించుకోవాలన్న ఆతృత. అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి వచ్చేస్తున్నారు. ఆన్లైన్‌లో టోకెన్లు దొరకని భక్తులు నేరుగా ఆఫ్‌లైన్లో కౌంటర్ల ద్వారా టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
గత వారం అయితే గందరగోళం నెలకొంది. భక్తులందరూ తోసుకోవడం.. కరోనాను అస్సలు లెక్కచేయకపోవడంతో చివరకు టిటిడి టోకెన్లను 7 వేలకు పెంచింది. ప్రస్తుతం శనివారం.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టోకెన్లను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసేసుకుంది.
 
7వేల టోకెన్లను శని, ఆదివారాల దర్సనానికి సంబంధించి శుక్రవారం అందజేసింది. 3,800 టోకెన్లను భక్తులు పొందారు. ఇంకా టోకెన్లు మిగిలి ఉన్నాయి. చాలా నెమ్మదిగా భక్తులు టోకెన్లను పొందుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా తిరుపతికి వచ్చి టోకెన్లను పొందవచ్చని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు