నైట్ వాచ్‌మెన్‌.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు... ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 1 మార్చి 2024 (10:48 IST)
కాస్తంత పట్టుదల, కొంచెం శ్రమను పెట్టుబడిగా పెడితే ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని ఓ తెలుగు కుర్రోడు చేతల్లో నిరూపించాడు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆ కుర్రోడి పేరు ప్రవీణ్. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం, పొన్కల్ గ్రామవాసి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రవీణ్ తన సొంత గ్రామంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. ఆపై ఉద్యోగ ప్రయత్నాల్లో పడిన ప్రవీణ్ ఉస్మానియా యూనివర్శిటీలోని ఎడ్యుకేషన్ మల్టీ మీడియా రీసెర్స్ సెంటర్‌లో రాత్రిపూట నైట్ వాచ్‌మెన్‌గా చేరాడు. 
 
గత ఐదేళ్ళుగా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తెలంగాణ గురుకుల విద్యాలయాల పోస్టులకు నిర్వహించిన పరీక్షలు రాశాడు. ఇటీవల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. ఓ వైపు నైట్ వాచ్‌మెన్‌‍గా పని చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు