అమ్మాయిల ఫోటోలు కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్

శుక్రవారం, 24 జులై 2020 (13:41 IST)
అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరస్థుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఫోటోలు కలెక్ట్ చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలను అమ్మాయిల ఫోన్ నంబర్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కోసం వేధించేవాడు మహమ్మద్.
 
మహమ్మద్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. 
హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్‌ని అదుపు లోనికి తీసుకున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.
 మహమ్మద్ వలలో పడి చాలామంది అమ్మాయిలు మోసపోయారని పోలీసులు నిర్ధారించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు