ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్​ మక్తాలా

శుక్రవారం, 6 మార్చి 2020 (06:29 IST)
కరోనా ప్రభావంతో ఐటీ రంగం పురోగతిపై అనుమానాలవసరం లేదని తెలంగాణ ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల్​ అన్నారు. 

కరోనా విజృంభించినా.. ఐటీ రంగం కుదేలవటానికి ఆస్కారమే లేదని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం రీత్యా తమ పనితీరులో మార్పులు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా వర్క్​షాప్స్, అబ్రాడ్ విజిట్స్ చేసే తమ ఉద్యోగులు అవి తగ్గించుకున్నారని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో కలకలం...
ఓ మహిళా కండక్టర్‌కు ఆ వైరస్‌ లక్షణాలున్నా యంటూ గురువారం సోషల్‌మీడియా సహా పలు చానళ్లలో వచ్చిన వార్తలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనం ఉలిక్కిపడ్డారు.

అయితే ఆమెకు కేవలం జలుబు, దగ్గు మాత్రమే ఉన్నాయని, కరోనా లక్షణాలేమీ కనిపించలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు స్పష్టం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సత్తుపల్లి  నుంచి ఏపీలోని ఏలూరు వెళుతోంది. ఆ బస్సు చింతలపూడి చేరుకున్న క్రమంలో అందులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్‌కు వాంతులు కావడంతో డ్రైవర్‌, అక్కడి కంట్రోలర్‌ స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు