దుబ్బాక ఉపఎన్నిక: రూ. 1 కోటి పట్టివేత

సోమవారం, 2 నవంబరు 2020 (16:23 IST)
తెలంగాణలో మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక జరుగబోతోంది. ఈ నేపధ్యంలో ఉప ఎన్నికలో డబ్బును పంచేందుకు అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుల్లో సురభి శ్రీనివాస్ రావు, బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోదరుడు ఉన్నారు. బేగంపెట్ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్ బృందం బేగంపేట్ ఫ్లైఓవర్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకున్నారు. టయోటా ఇన్నోవాలో తీసుకెళుతున్న ఈ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్లలో 500, 2,000 ఉన్నాయి. నిందితుడు సురభి శ్రీనివాస్ రావు హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.ఎ టు జెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే టెక్నికల్ మ్యాన్‌పవర్ సప్లై బిజినెస్ నడుపుతున్నాడు. కాగా గత 10 రోజుల్లో కనీసం రెండున్నర కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసారు. ఇదంతా ఎన్నికల్లో పంచేందుకేనని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు