తెలంగాణలో భారీ వర్షాలు, పిడుగులకు అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరిక

సోమవారం, 10 ఆగస్టు 2020 (13:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.అయితే రానున్న మరో 24 గంటల్లో కూడా అక్కడక్కడ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాతావరణం వలన రాబోయే మూడు రోజులపాటు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సోమవారం రోజున అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విస్తరించి ఉంది. రాష్ట్రంలో భారీ నుంచి ధిక భారీ వర్షాల పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో అదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంఖర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
 
వర్షాలు భారీగా పడే అవకాశం ఉండడం వలన ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎవరూ బయటికి రాకూడదని వాతావ రణశాఖ హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు