భర్తను వదిలేసింది, ఒకరి తర్వాత ఇంకొకరు, వివాహేతర సంబంధంతో అతడి హత్య

ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:57 IST)
హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతమది. భాగ్యలక్ష్మి కాలనీలో నివాసముంటున్న పోచమ్మకి మెదక్‌కి చెందిన క్రిష్ణతో పరిచయం ఏర్పడింది. భాగ్యలక్ష్మికి వివాహమై భర్తతో విభేధించి వేరుగా ఉంటోంది. భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. 
 
క్రిష్ణతో గత రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. కుటుంబ సభ్యులకు తెలిసి మందలించారు. వేరొకరితో పెళ్ళి చేసేందుకు సిద్ధమయ్యారు. వారు ఉన్న ప్రాంతం నుంచి పక్కనే ఉన్న మాధవ్ నగర్‌కు వెళ్ళిపోయారు.
 
అక్కడ కూడా మేస్త్రి మాధవరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది పోచమ్మ. విషయం కాస్త క్రిష్ణకు తెలిసింది. తనకు దగ్గరగా ఉన్న మహిళ వేరొకరితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
 
ఎలాగైనా మాధవరావును, పోచమ్మను ఇద్దరినీ చంపేయాలనుకున్నాడు. పూటుగా మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి మాధవరావు ఇంటిపై దాడి చేసి కత్తితో అతన్ని చంపేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు రావడంతో నిందితునితో పాటు అతనికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు