హీరోయిన్లు రూటు మార్చేశారుగా..? బాగా తగ్గించేశారట..!

శనివారం, 18 జులై 2020 (18:19 IST)
కరోనా కాలానికి ముందు బాగా సంపాదించేసిన హీరోయిన్లు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో పప్పులుడకవని తెలిసి రూటు మార్చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీపం వున్నప్పుడే.. డిమాండ్ వున్నప్పుడే వున్న క్రేజ్‌ను బాగా యూజ్ చేసుకున్న హీరోయిన్లు.. ప్రస్తుతం కరోనా కారణంగా ఒకడుగు వెనక్కి తగ్గారు. పారితోషికాల విషయంలో కోతలు తప్పవని తెలిసి.. పారితోషికాలను ముందుగానే తగ్గించేసుకున్నారట టాలీవుడ్ హీరోయిన్లు. 
 
ఈ క్రమంలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు తమ రెమ్యూనరేషన్స్‌ విషయంలో కాస్త తగ్గారని తెలిసింది. ఇటీవల సినిమాకి 2 కోట్లు వసూలు చేసిన కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి 'ఆచార్య'కు కోటిన్నర మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. 
kajal agarwal
 
ఇక ఆఫర్ల కోసం వేచి చూస్తున్న రకుల్‌ కూడా ఇంతకు ముందు అందుకున్న మొత్తంలో సగానికి సగం డిస్కౌంట్‌ ఇస్తున్నానని నిర్మాతలకు సంకేతాలు పంపేసిందని టాక్ వస్తోంది. ప్రస్తుతానికి రకుల్ నితిన్ సరసన ఓ సినిమా చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు