రకుల్ ప్రీత్‌కు లక్కీ ఛాన్స్ : కరణం మల్లీశ్వరి పాత్రలో...

మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:17 IST)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి పాత్రలో ఆమె నటించనుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల కాలం కొనసాగుతోంది. ఇందులోభాగంగా, నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌స్తుతం ఒలింపిక్ విజేత, వెయిట్ లిఫ్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ కోసం హీరోయిన్‌ను వెతికే ప‌నిలో కోన వెంకట్ నిమగ్నమైవున్నారట. తొలుత ఈ పాత్ర కోసం తాప్సీని సంప్ర‌దించ‌గా.. వేరే సినిమాల కార‌ణంగా తాప్సీ రెడీగా లేన‌ట్టు చెప్పింద‌ట‌. ఫిట్నెస్ నైపుణ్యాలు క‌లిగిన న‌టి అయితే ఈ రోల్‌కు బాగా సెట్ అవుతుంద‌ని భావించిన కోన వెంక‌ట్... ర‌‌కుల్ ప్రీత్‌ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ర‌కుల్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోదరుడితో కలిసి భాగ్యనగరంలో ఉంటోంది. అదేసమయంలో రకుల్ ప్రీత్ సింగ్ అటు సినిమాల‌తో పాటు ఇటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‌- క్రిష్ కాంబినేష‌న్‌లో రానున్న "విరూపాక్ష" చిత్రంలో నటించనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇపుడు కరణం మల్లీశ్వరిగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు