నాగ్ ఎంత పనిచేసాడు, ఆ డైరెక్టర్‌కి షాకే..!

మంగళవారం, 28 జులై 2020 (18:18 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే... ఈ సినిమా తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ బంగార్రాజు చేయనున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
 
వైల్డ్ డాగ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బంగార్రాజు సెట్ పైకి వెళ్లడం ఖాయం అనుకున్నారు కానీ.. నాగార్జున బంగార్రాజు కాకుండా మరో సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు.
 
ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది అని తెలియచేసారు.
 
ఎప్పటి నుంచో బంగార్రాజు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఓకే చెబుతారు అని ఎదురుచూస్తున్న కళ్యాణ్ కృష్ణకు షాక్ ఇచ్చారు. మరి... కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు కోసం ఇంకా వెయిట్ చేస్తాడా..? లేక మరో ప్రాజెక్ట్ చూసుకుంటాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు