ప్రకంపనలు సృష్టిస్తున్న ముంబై డ్రగ్స్ కేసు : నమ్రతా - జయా చాటింగ్ ఇదే?

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:05 IST)
బాలీవుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రపంకనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్‌ను సైతం చుట్టుకుంది. ముఖ్యంగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌తో బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీడియా మేనేజర్ జయా సాహా చాటింగ్ చేసినట్టు తేలింది. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంపాదించినట్లు వినికిడి. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. 
 
నిజానికి ఈ కేసులో ఇప్పటికే నటి రియా చక్రవర్తితో పాటు.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ ఇంటి మేనేజరు, పని మనిషి, మీడియా మేనేజర్ను ఎన్.సి.బి. అరెస్టు చేయడం జరిగింది. వీరివద్ద జరిపిన విచారణలో అనేక విషయాలతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో ఒక్కోరోజు ఒక్కో పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా నమ్రతా శిరోద్కర్ పేరు రావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను చూసిన తర్వాత నమ్రతా టీమ్ ఖండించినప్పటికీ, అవి డ్రగ్స్‌కు సంబంధించినవా? కావా? అన్న విషయమై మాత్రం సమాచారం లేదు.
 
కోడ్ భాషలో ఉన్న ఒక్కో అక్షరాన్నీ డీ కోడ్ చేస్తున్న అధికారులు, రోజుకో పేరును బయటకు తీస్తున్నారు. ఎన్ అంటే నమ్రత అని, డీ అంటే దీపికా పదుకొనే అని, కే అంటే దీపిక మేనేజర్ కర్మిష్మా అని, జే అంటే జయా సాహా అని, ఎస్ అంటే శ్రద్ధా కపూర్ అని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ చాటింగ్స్‌లో నమ్రతతో పాటు జయ, దీపిక, కరిష్మా తదితరులు పాల్గొన్నట్టు నిర్ధారించుకున్న అధికారులు, ప్రస్తుతం మరింత లోతుగా దర్యాఫ్తు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. 
 
ఇకపోతే, డ్రగ్స్ కేసులో నమ్రత పేరు బయటకు రావడం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. అన్ని టీవీ చానెళ్లు, మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. మూడేళ్ల క్రితం టాలీవుడ్‌లో బయటకు వచ్చిన డ్రగ్స్ కేసును ఇప్పుడు బాలీవుడ్ కేసుతో పోలుస్తూ కథనాలు వెలువడుతున్నాయి. 
 
కాగా, అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఎన్, జే మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఇదే...
 
ఎన్: ముంబైలో మంచి ఎండీ ఇస్తానని గతంలో హామీ ఇచ్చావు. నేను వచ్చినప్పుడు ఇవ్వాలి. నాకు బ్రేక్ కావాలి. మనం మంచి పార్టీ చేసుకుందాం.
జే: నన్ను డ్రగ్స్ అమ్మకందారుగా చేస్తున్నావు. అయినా సరే... నువ్వు ఎలా చెబితే అలా చేస్తా!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు