వామ్మో.. ప్రియుడి కోసం రూ.25లక్షలు ఖర్చు చేసిందా?

శనివారం, 26 సెప్టెంబరు 2020 (18:02 IST)
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ప్రేమలో వుంది. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తోంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార... విఘ్నేష్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వున్నట్లు వార్తలు వచ్చాయి.
 
అయితే దీనిపై మాత్రం ఇప్పటి వరకు నయన్ స్పందించలేదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి నయన్ గోవాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరు తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
అయితే విఘ్నేష్ పుట్టినరోజును దగ్గరుండి జరిపిన నయన్‌ అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. గోవాలో మూడు రోజుల పర్యటన కోసం నయనతార రూ.25 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఇది తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు