వెంకీ 75వ చిత్రం ఇదే, సురేష్ బాబు ప్లాన్ అదిరింది

శనివారం, 19 సెప్టెంబరు 2020 (12:28 IST)
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 74వ చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో వెంకీ సరసన ప్రియమణి నటిస్తుంది. కరోనా లేకుంటే ఈపాటికే నారప్ప ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ.. ఇప్పుడు సురేష్‌ బాబు ప్లాన్ మొత్తం మార్చేసారు.
 
ఇంతకీ విషయం ఏంటంటే, నవంబర్ నుంచి వెంకీ ఎఫ్ 3 మూవీకి డేట్స్ ఇచ్చారు. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయన్నారు. అంటే.. వెంకటేష్ 74వ సినిమాగా ఎఫ్ 3 రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక వెంకీ 75వ చిత్రంగా నారప్ప సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. అనిల్ రావిపూడి సక్సస్‌లో ఉన్నాడు.  74వ సినిమా ఎఫ్ 3 ఎలాగైనా సక్సస్ అవుతుంది. అప్పుడు 75వ సినిమా నారప్ప రిలీజ్ చేస్తే.. అందులో సోలో హీరోగా చేస్తున్నాడు కాబట్టి బాగుంటుంది. అదీ కాకుండా అప్పటికీ కరోనా మొత్తం వెళ్లిపోయి థియేటర్స్‌కి జనాలు వస్తారు.
 
 వరుసగా సక్సస్‌లో ఉండడం వలన 75వ సినిమాకి మరింత క్రేజ్ వస్తుంది అనే ఉద్దేశ్యంతో సురేష్‌ బాబు ఇలా ప్లాన్ చేసారట. ఇది తెలిసిన టాలీవుడ్ జనాలు సురేష్ బాబు బుర్ర మామూలు బుర్ర కాదు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు