బాలయ్య మూవీలో సీనియర్ హీరోయిన్, ఇంతకీ ఎవరు..?

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (22:51 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సినిమాని జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసారు.
 
ఈ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే... ఈ సినిమాలో బాలయ్య అఘోర గెటప్‌లో కనిపించనున్నారు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన గెటప్ ఎలా ఉంటుంది..? నిజంగానే అఘోరా గెటప్‌లో కనిపిస్తారా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నారట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటారా...? అలనాటి అందాల తార జయప్రద. ఈమె ఈ సినిమాలో నటించనున్నారని తెలిసింది. ఈ భారీ యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు భార్య పాత్ర ఉందని.. ఈ పాత్రకు జయప్రద తీసుకోవాలని అనుకుంటున్నారట.
 
అయితే... సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్‌లో మాత్రమే కనిపిస్తారని.. ఆ క్యారెక్టర్ జోడీగా ప్లాష్‌బ్యాక్‌లో జయప్రద కనిపిస్తుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు