'మా' ప్రమాణ స్వీకారంలో కలిసిన నరేష్ - శివాజీరాజా

శుక్రవారం, 22 మార్చి 2019 (17:05 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ విషయంలో గత కొంతకాలంగా నరేష్‌కు, మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు జరిగిన ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరుకావడం విశేషం. 
 
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలపాటు నా పదవి కాలంలో మా అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని, దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని అన్నారు. ప్రతి సభ్యుడికి మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు.
 
శివాజీరాజా మాట్లాడుతూ 'మా' కమిటి ఎఫ్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్నారు. నా కంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఫండ్స్ తీసుకొచ్చి పెట్టామని, దాంట్లోంచి ఒక్క పైసా తేడా రాకుండా చూసుకున్నామని చెప్పారు. అలాగే కొత్త కమిటీ కూడా కష్టపడి బయటనుంచి ఫండ్స్ కలెక్ట్  చేసి తీసుకురావాలన్నారు. నా నుంచి ఎటువంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉంటానన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు