గర్భవతి అయిన శృతి... అర్జున్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుందా?

గురువారం, 18 జులై 2019 (09:18 IST)
యాక్షన్ కింగ్ అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తలకెక్కిన హీరోయిన్ శృతి హరిహరన్. ఈ ఒక్క ఆరోపణలతో ఆమె మంచిపాపులర్ అయ్యారు. మీ టూ ఉద్యమం బాగా ఊపుమీద ఉన్న సమయంలో శృతిహరిహరన్ ఈ తరహా ఆరోపణలు గుప్పించింది. 
 
ఈమె మాతృభాష కన్నడంలో మంచి పాపులర్‌కాగా, ఆ భాషలో అనేక చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమె ఓ వర్ధమాన నటుడిని పెళ్లి చేసుకుంది. కానీ, ఈ పెళ్లికి సంబంధించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా, తనకు ఇంకా పెళ్లి కాలేదన్నట్టుగా ప్రవర్తించారు. 
 
అయితే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తాను గర్భవతినంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోని అప్‌డేట్ చేసింది. హీర్ అర్జున్‌పై ఆరోపణలు చేసినప్పుడు ఆమె పెళ్లి విషయాన్ని దాచిపెట్టిందనే వార్తలు వచ్చాయి. 
 
అర్జున్ కూడా తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అయితే అప్పుడు శృతి హరిహరన్.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేసింది. తన మారిటల్ స్టేటస్‌కి అర్జున్ చేసిన లైంగిక వేధింపులకు సంబంధం ఏమిటని కూడా ప్రశ్నించింది.
 
రామ్‌కుమార్ అనే వర్థమాన నటుడ్ని ఆమె రీసెంట్‌గా వివాహమాడిందట. రామ్,శృతి ఇద్దరూ ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జంటగా ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేయలేదు. కానీ సడెన్‌గా తన భర్త రామ్ కిలారీ అని, తాను తల్లిని కాబోతున్నాను అని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ఫోటో  పోస్ట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు